ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అవిశ్వాసం పేరుతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారా? తనంత తానుగా ఘర్జిస్తున్నానని, కేంద్ర ప్రభుత్వాన్ని వణికించే సామర్థ్యం కలవాడిని అని తన అనుకూల మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటున్నారు. కేంద్రంపై ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానానికి మద్దతివ్వాలని కోరుతూ దేశంలోని అన్ని పార్టీల ఎంపీలకు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు లేఖలు రాశారు. ప్రధాని మోడీ స్వయంగా ఇచ్చిన 18 హామీలు అపరిష్కృతంగా ఉన్నాయని, ఏపీకి జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించేందుకే అవిశ్వాసం పెట్టామని బాబు ఆ లేఖల్లో పేర్కొన్నారు. పదేండ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామన్న బీజేపీ ఇప్పటి వరకు హోదా ఇవ్వలేదన్నారు.
దీంత పాటుగా తన పార్టీ నేతలతో టెలీకాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తూ హడావుడి చేస్తున్నారు. ఇక బాబుకు వంత పాడే మీడియా సంగతి సరేసరి. అయితే, ఇంతకీ ఇన్నిమాటలు చెప్తున్న చంద్రబాబు ఎందుకు రాజధాని అమరావతి దాటి వెళ్లడం లేదు? ఇక్కడి నుంచి సందేశాలు ఇచ్చే బదులుగా పార్లమెటు సెంట్రల్ హాల్‌లో ఉండి తన ఎంపీలకు దిశానిర్దేశం చేయవచ్చు కదా? పచ్చ బ్యాచ్ ప్రచారం చేస్తున్నట్లు చంద్రబాబు భూమి ఆకాశాలను ఏకం చేస్తే…ప‌్రత్యక్షంగా ఢిల్లీలో ఉంటే ఆ ప్రభావం ఎక్కువ ఉంటుంది కదా? ఇవన్నీ సందేహాలు..చర్చోపచర్చలు..