ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఎవరూ విమర్శించకూడదట.. విమర్శల పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీకి మాత్రమే ఉందట.. లక్ష కోట్ల అవినీతి అంటూ ఆధారం లేకుండా విమర్శలు చేయడంకూడా చంద్రబాబుకే చెల్లింది. కలిసి ఉన్నప్పుడు నెత్తిన పెట్టుకుని ఊరేగించిన మోదీనే నోటికొచ్చినట్టు విమర్శించే చంద్రబాబు ను ఎవ్వరూ ఏమీ అనొద్దట.. దేశంలో టెక్నాలజీ పెరగటానికి తానే పితామహుడినని చెప్పుకుని, ఈ ఓటింగ్ పై ప్రచారం చేసి ఇప్పుడు అదే ఈవీఎమ్ విధానాన్ని విమర్శించడం నిజంగా రెండు నాల్కల సిద్ధాంతకర్త అనడానికి సరిగ్గా సరిపోతుంది.
ప్రత్యేక హోదా ఏమైనా సంజీవనా అని విమర్శించిన ఏకైక వ్యక్తి కూడా ఈయనే. ఈయన విమర్శలు వ్యక్తులను కాదు.. వ్యవస్థలను.. హోదా, సీబీఐ, ఈవీఎంలు ఇలా ఏది నచ్చకపోయినా విమర్శిస్తూనే ఉంటారు.గతంలో వైయస్ రాజశేఖరరెడ్డి హాయాంలో హైదరాబాద్ కు ఎయిర్ పోర్టు, రింగ్ రోడ్డు, శంషాబాద్ ఫ్లై ఓవర్ ఇలా ప్రతి అంశాన్నీ విమర్శించి మళ్లీ ఆయన చేసిన పనులన్నీ తాను చేసినట్టు బిల్డప్ ఇస్తున్నారు. 23మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొని, పక్క రాష్ట్రంలో తమ ఎమ్మెల్యేలను కొంటున్నారంటూ నిస్సిగ్గుగా విమర్శలు చేయడం దేశంలో చంద్రబాబుకు తప్ప మరొకరికి చెల్లదు. ప్యాకేజీతో పవన్ ను పక్కన పెట్టుకుని కుల సమీకరణాలు చేసి, చివరకు ఆ పవన్ నే పిచ్చిగా పచ్చ తమ్ముళ్లతో విమర్శలు చేయించారు చంద్రబాబు గారు.
తాను అవినీతి, అక్రమాలు చేసినా, విభజన హామీలు గంగలో కల్పినా, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచెత్తినా, దుబారా ఖర్చులతో ఖజానాకు చిల్లుపెట్టినా మరెవ్వరూ బాబును విమర్శించకూడదట. సోషల్ మీడియాలో వ్యతిరేకంగా పోస్టులు పెట్టిన వారిని కొన్నాళ్లుగా అరెస్టులు చేయిస్తున్నారు. సభల్లో నిరసన తెలిపితే పోలీసులతో కొట్టిస్తున్నారు. మోడి, జగన్, కేసీఆర్ లు చంద్రబాబును ఎంతో క్లియర్ గా విమర్శించినా తాను మాత్రం వాళ్లెందుకు నన్ను విమర్శిస్తున్నారో నాకు అర్ధం కావట్లేదు.. నన్నెందుకు తిడుతున్నారో తెలియడం లేదంటూ కల్లబొల్లి కబుర్లు చెప్తున్నారు చంద్రబాబు.