టాలీవుడ్ స్టార్ విక్టరీ వెంకటేశ్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం మరి కొద్ది రోజుల్లో జరగనుంది.అంటే దగ్గుబాటి వారి ఇంట్లో పెళ్లి సందడి మొదల కానుంది.ఆశ్రిత పెళ్లి గురించి గత కొన్ని రోజులుగా రకరకాల వార్తలు వస్తున్నాయి.మొన్నటివరకు అక్కినేని అఖిల్‌తో పెళ్లి అని వార్తలు రాగా అవి రూమర్స్ అని తేలిపోయింది.తాజాగా మరోసారి ఈమె వార్తలకు ఎక్కింది.కొంతమంది హైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురెందర్ రెడ్డిగారి మనవడితో మరి కొందరు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి బంధువులతో ఆశ్రిత పెళ్లి జరగనుందని అనుకుంటున్నారు.
పెళ్లి కొడుకు ఎవరో లేదా మాజీ సీఎం బంధువా అనేదానిపై స్పష్టత లేదు కాని పెళ్లి మాత్రం రానున్న రెండు నెలల్లో ఉంటుందని తెలుస్తుంది.ఒక పక్క సినీ ఫీల్డ్ మరోపక్క బిజినెస్ అండ్ రాజకీయ పలుకుబడి ఉండడంతో రెండు కుటుంబాలలో ఎవరో ఒకరితో ఆశ్రిత పెళ్లి జరగడం ఖాయమని తెలుస్తుంది.ఇదే కనుక నిజం ఐతే చాలా రోజుల తరువాత వెంకీ ఫ్యామిలీ లో ఒక శుభకార్యం జరగనుంది.ఇదంతా జరగాలి అంటే వెంకటేష్ ఆశ్రిత పెళ్లి ఎవరితో అనే దానిపై స్ఫష్టత ఇవ్వాల్సుంది.