అందరిని ఆకట్టుకునే అందం ఉన్న రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు, తమిళం, హిందీ భాషలలో టాప్ హీరోలతో నటించిన విషయం అందరికి తెలిసిందే.కొంతకాలంగా తెలుగులో వరుస సినిమాలలో నటిస్తూ తన ఖాతాలో హిట్స్ నమోదు చేసుకుంది.ప్రస్తుతం రకుల్ కన్ను తమిళం, హిందీ పరిశ్రమపై పడింది.అయితే ఇప్పటికే తెలుగులో వెంకీమామ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైన ఈమె బాలయ్య- బోయపాటి కాంబినేషన్ లో వచ్చే సినిమాకు సెలెక్ట్ అయినట్టు తెలిసింది.సింహ,లెజెండ్ తర్వాత వీరిద్దరిది ఇది మూడో చిత్రం కానుంది..కాగా అన్ని కలిసి వస్తే రకుల్ కి కూడా బోయపాటితో ఇది ముడోదే.ఎందుకంటే సరైనోడు’, ‘జయజానకి నాయక’ ఈయన దర్శకత్వంలో వచ్చినవే.అయితే బాలయ్యతో కథానాయకుడులో ఆకుచాటు పిందె తడిసే సాంగ్‌లో స్టెప్పులేసింది.అన్ని ఓకే అయితే ఈ ఇద్దరు హీరో హీరోయిన్లుగా బోయపాటి దర్శకత్వంలో సెట్స్ పైకి రానున్నారు.ఆ తరువాత పూర్తిగా తమిళం, హిందీ పరిశ్రమపై దృష్టి పెట్టనున్నారని సమాచారం.
