ఐటీ గ్రిడ్స్ సంస్థ..ఈ పేరు వినగానే టక్కున గుర్తుకొచ్చేది ఓటర్ స్కాం.అయితే ఆ సంస్థ మూతబడడంతో మన చిట్టి నాయుడు బుర్ర పనిచేయడం లేదట. మంగళవారం నాడు వైఎస్ఆర్సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా సీఎం చంద్రబాబు,లోకేష్ పై వ్యంగ్యాస్త్రాలు వదిలారు.
‘ఐటీ గ్రిడ్ క్లోజయినప్పటి నుంచి చిట్టి నాయుడు మెదడులో అమర్చిన ‘చిప్’ సిగ్నల్స్ తీసుకోవడం లేదట. ‘ఎర్రర్’ చూపిస్తోంది. అందుకే వారం రోజులుగా అజ్ణాతంలోకి పంపించాడు పెద్ద నాయుడు. డేటా దొంగ అశోక్ ప్రస్తుతం చిప్ ను యాక్టివేట్ చేసేందుకు విఫలయత్నం చేస్తున్నాడు’.
చైనాలోని కార్లు అమ్ముడు కాక ప్లాంటును మూసేసింది,అలాంటిది అనంతపురం లో ప్లాంట్ పరిస్థితి ఏమిటని ఆయన ప్రశ్నించారు.కమిషన్లకు కక్కుర్తి పడి ఆ సంస్థకు బాబు రూ. రెండు వేల కోట్ల రాయితీలిచ్చాడనీ,అక్కడ కనీసం స్థానికులు వంద మంది కుడా లేరని మండిపడ్డారు.రానున్న ఎన్నికల్లో పోలీసు, సివిల్ అధికారులంతా న్యాయం వైపు నిలవాలని విజ్ఞప్తి చేశారు.