ఉత్తరప్రదేశ్ ,ఉత్తరాఖండ్ రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రి,అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ గవర్నర్ ఎన్డీ తివారీ కుమారుడు రోహిత్ శేఖర్ మృతి కేసులో మరో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో శేఖర్ తివారీ సతీమణి అపూర్వ తివారీని దేశ రాజధాని మహానగరం ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను మూడు రోజుల పాటు విచారించిన పోలీసులు ఈ రోజు బుధవారం అరెస్టు చేశారు.రోహిత్ శేఖర్ తివారీది సహాజ మరణం కాదు అని గత కొద్ది రోజుల కిందట వైద్య నివేదికలో బయటపడింది. ఈ క్రమంలో ఆయన భార్యను విచారించడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అయితే అపూర్వ తివారీ తన భర్త అయిన శేఖర్ తివారీను దిండు అదిమి మరి చంపినట్లు వార్తలు వస్తున్నాయి.
