మహర్షి.. రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా దిల్‌రాజు ఈ చిత్రాన్నినిర్మించారు. మహేష్‌బాబు కెరీర్‌లోనే శాటిలైట్ రైట్స్ భారీ ధరలు పలికిన మహర్షి సినిమా ఇవాళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మహేష్ అభిమానుల హడావిడి కాసేపు పక్కన పెడితే మంచి విలువలు కలిసిన సినిమా మహర్షి అని చెప్పవచ్చు. ప్రతీ మనిషి జీవితంలో ఒడిదుడుకులు సహజం వాటిని ఎదుర్కొని విజయాన్ని ఎలా సాధించారు అనేదే “మహర్షి జర్నీ ఆఫ్ రిషీ” సినిమా సారాంశం. సినిమాలో ఫస్ట్ ఆఫ్ మహేష్ బాబు కాలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో సాగగా.. మిగతా కథంతా మహేష్ బాబు ఎదుగుతున్న తీరు, ఆయన ఎదుర్కొన్న సమస్యలు, సక్సెస్ ఎలా సాధించారు అన్న అంశాలతో సాగింది.
బిజినెస్ మ్యాన్, శ్రీమంతుడు, భరత్ అనే నేను సినిమాల పోలికలు కాస్త కనిపించినప్పటికీ వంశీ పైడిపల్లి కథను సానబెట్టడం. ప్రధానంగా రైతుల కష్టాలు, రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై మహేష్ మార్క్ యాక్టింగ్ సినిమాలో కొట్టొచ్చినట్లుగా కనిపిస్తుంది. అల్లరి నరేష్ పాత్ర కీలకం కావడం. అల్లరి నరేష్‌ను ఇంకొంచం ఎక్కువగా వాడుకుని ఉంటే బాగుండేది అనిపిస్తుంది. సంగీతం విషయానికొస్తే సాంగ్స్ కాస్త అభిమానులకు నిరాశ కలిగించగా.. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎక్కడో విన్నట్లుగా అనిపించడం కొంత మైనస్‌గా చెప్పుకోవచ్చు.
ఇక సెకండ్ ఆఫ్ అత్యంత కీలకం. దీని విషయానికొస్తే శ్రీమంతుడు సినిమాలోని పోలికలు రెండో భాగంలోనూ కనిపించడం కాస్త ఇబ్బందిగా అనిపించగా రెండో భాగం కాస్త సాగదీయకుండా ఉంటే మరింత బాగుండేది. క్లైమాక్స్‌లో వచ్చే 20 నిమిషాల సన్నివేశం మనసుకు తాకడం, మహేష్ బాబు డైలాగ్స్, చివరగా మహేష్ బాబు ప్రెస్‌మీట్ ప్రేక్షకుల్లో భావోధ్వేగాన్ని నింపాయని చెప్పుకొచ్చు. ఇలా ప్రేక్షకులను ఆకట్టుకున్నమహర్షితో.. మహేష్ బాబు సమ్మర్ హిట్ కొట్టారనే చెప్పాలి.
ప్లస్ పాయింట్స్ :
1. మహేష్ బాబు గ్లామర్,
2. అల్లరి నరేష్ నటన,
3. క్లైమాక్స్ ఎమోషన్ సీన్స్.
మైనస్ పాయింట్స్ :
1. స్లో నెర్రేషన్,
2. పూజా హెగ్డే సిల్లీ కామెడీ,
3. బ్యాక్‌గ్రౌండ్ స్కోర్.
బాటమ్ లైన్ : శ్రీమంతుడు ప్లస్ భరత్ అనే నేను = (సాగదీసిన) మహర్షి.