దేశ వ్యాప్తంగా నిన్న గురువారం విడుదలైన పార్లమెంట్ ఎన్నికల ఫలితాల్లో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాలుగు స్థానాల్లో విజయదుందుభి మ్రోగించిన సంగతి తెల్సిందే. ఈ క్రమంలో
సికింద్రాబాద్,కరీంనగర్,నిజామాబాద్ ,ఆదిలాబాద్ పార్లమెంట్ స్థానాల్లో బీజేపీ గెలుపొందింది.
అయితే సికింద్రాబాద్ నుండి తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్యులు తలసాని శ్రీనివాస్ యాదవ్ తనయుడు తలసాని సాయికిరణ్ యాదవ్ పై బరిలోకి దిగి గెలుపొందిన మాజీ ఎమ్మెల్యే కిషన్ రెడ్డికి ఈ సారి కేంద్రంలో మంత్రి వర్గంలో స్థానం లభించనున్నది అని సమాచారం. అయితే తెలంగాణ నుండి గెలుపొందిన నలుగురిలో కిషన్ రెడ్డి అత్యంత సీనియర్ నేత.
అంతేకాకుండా రెండు సార్లు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా పని చేశారు. అంబర్ పేట నుండి మూడు
సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన అనుభవం కిషన్ రెడ్డి సొంతం. అంతేకాకుండా ప్రధాన మంత్రి నరేందర్ మోదీ టీమ్ లో కిషన్ రెడ్డి ఒకరు. అందుకే ఆయనకు కేంద్ర మంత్రిగా
అవకాశముందని బీజేపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు..