టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఇటీవలే నటించిన చిత్రం మహర్షి.ఈ చిత్రంతో మహేష్ తన ఖాతాలో మరో హిట్ వేసుకున్నాడు.అంతేకాకుండా ఇది ఒక సోషల్ మెసేజ్ కావడంతో ప్రేక్షకుల మదిలో నాటుకుపోయింది.ఈ మధ్యకాలంలో మహేష్ ఎంచుకున్న కధలు కూడా ఎక్కువగా ఇవే ఉంటున్నాయి.ఈ చిత్రం తరువాత మహేష్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో సినిమా చేస్తున్నాడనే విషయం అందరికి తెలిసిందే.అయితే ఈరోజు మహేష్ తండ్రి సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మహేష్ కొత్త చిత్రం ” సరిలేరు నీకెవ్వరు ” ప్రారంభించారు.ఈ చిత్రాన్ని అనిల్ సుంకర , దిల్ రాజు నిర్మిస్తున్నారు.2020 జనవరి కి విడుదల చేయనున్నారు.డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇప్పటివరకూ తీసిన అన్ని చిత్రాలు సూపర్ హిట్ అవ్వడంతో మహేష్ అభిమానులు ఈ చిత్రంపై భారీ అంచానాలు పెట్టుకున్నారు.ఇందులో మహేష్ కు జంటగా రష్మిక మంధన నటిస్తుంది.