సూపర్ స్టార్ మహేష్,పూజా హెగ్డే జంటగా నటించిన చిత్రం మహర్షి.వంశీ పైడిపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించగా దిల్ రాజు నిర్మాతగా వ్యహరించారు.ఈ చిత్రంలో అల్లరి నరేష్ ముఖ్య పాత్రలో నటించడం జరిగింది.ఇప్పటికి కూడా ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు సృష్టిస్తుంది.వంశీ పైడిపల్లితో మంచి హిట్ అందుకున్న మహేష్ మరోసారి అదే డైరెక్టర్ తో సమ్మర్ స్పెషల్ గా ఇంకో ప్రాజెక్ట్ కు ఓకే చెప్పినట్టు సమాచారం.ఈ మేరకు ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా జరుగుతున్నాయని తెలుస్తుంది.దీనికి కూడా దిల్ రాజు నిర్మాత భాధ్యతలు తీసుకుంటున్నారట.ఈయన వరుసగా మహేష్ మూడు సినిమాలను నిర్మించారు.ప్రస్తుతం మహేష్ అనిల్ రావిపుడితో సినిమా తీస్తున్నాడు.ఈ చిత్రానికి కూడా దిల్ రాజునే నిర్మిస్తున్నాడు.ఇందులో మహేష్ కు జంటగా రష్మిక మంధన నటిస్తుంది.మహేష్ కు ఈ సెంటిమెంట్ కుడా బాగా కలిసొచ్చిందని చెప్పాలి.అందుకే వంశీతో మరో సినిమా తీయనున్నాడు.