మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారంలో ఉన్న ఐదేళ్ళు ఏదైనా మీటింగ్ పెడితే చాలు అటు నాయకులు,ఇటు అధికారులు గుంపుగా వచ్చి వాలిపోయేవారు.అంతే కాకుండా ఒక పద్ధతి కూడా పాటించేవారు.ఇప్పుడు ఎలాగూ అధికారులతో సమీక్షలు,మీటింగ్ లు ఉండవు కాబట్టి ఇంక సొంత పార్టీ నాయకులతోనే మీటింగ్ లు పెట్టుకోవాలి.కాని చంద్రబాబుకి ఇక్కడ సీన్ రివర్స్ అయ్యిందని చెప్పాలి.ఎందుకంటే అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చినంత గౌరవం ఇప్పుడు లేదు.మీటింగ్ లకు రమ్మని రెండు మూడుసార్లు కబురు పంపిన లెక్కచేయడం లేదు.మీటింగ్ కు రాకపోవడమే కాక ఎవరికివారు స్వతత్రంగా మీటింగ్లు పెట్టుకుంటున్నారు.చంద్రబాబు విదేశీ పర్యటనకు అనంతరం కాపులకు మీటింగ్ పెట్టగా ఒక్కరుకూడా రాలేదట,ఐన సరే బాబు మరోసారి కబురుపెట్టిన ఎవ్వరూ పట్టించుకోలేదు.ఇది అలా ఉండగా చంద్రబాబు పర్యటనలో ఉండగానే రామచంద్రాపురం ఎమ్మెల్యే తోట త్రిమూర్తులు సమక్షంలో కాపు నాయకులు అంతా కాకినాడలో మీటింగ్ పెట్టిన విషయం అందరికి తెలిసిందే.అందులోను మీటింగ్ కి వచ్చినవారంత ఓడిపోయిన ఎమ్మెల్యేలే.దీంతో మరింత అనుమానాలు రేకెత్తుతున్నాయి.
