Home / ANDHRAPRADESH / ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.

ఏపీ,తెలంగాణాల్లో సంచలనం.

కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన నాదెండ్ల భాస్కర్ రావు బీజేపీలో చేరనున్నట్లు
సమాచారం. బీజేపీ అధ్యక్షుడు,కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా నేడు శనివారం తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరానికి విచ్చేయుచున్న నేపథ్యంలో ఆయన కాషాయ కండువా కప్పుకోనున్నారు అని
సమాచారం. అయితే ప్రస్తుతం క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటున్న నాదెండ్ల అప్పట్లో దివంగత మాజీ సీఎం,ప్రముఖ సీనియర్ నటుడు నందమూరి తారకరామారావు స్థాపించిన తెలుగు దేశం పార్టీ లో నెంబర్
2గా ఒక వెలుగు వెలిగారు. ఆ తర్వాత కొన్ని కొన్ని రాజకీయ కారణాల వలన నాదెండ్ల ముఖ్యమంత్రి అయ్యారు.