Home / SLIDER / వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.

వినడానికి వింతగా ఉన్న ఇది నిజం.. అసలు విషయం ఏంటంటే “బ్రెయిన్ డెడ్ అయ్యా డు.. ఇక బతుకడు ఇంటికి తీసుకెళ్లండని వైద్యులు తెలిపారు. దీంతో చేసేది ఏమి లేక ఆ బాధితుడి ఖననం కోసం బంధువులు ఏర్పాట్లు చేశారు.. గ్రామస్థులు, చుట్టాలు అంతా ఇంటికి చేరుకున్నారు.. మరికాసేపట్లో అంత్యక్రియలకు సిద్ధం చేస్తుండగా, కొడుకు దేహాన్ని చూసి ఆ తల్లి గట్టిగా రోదించసాగింది. వెంటిలేటర్ తొలగించిన తర్వాత కూడా తన కొడుకు గుండె కొట్టుకోవడంతో అంత్యక్రియలు రద్దు చేశారు. ఆ వ్యక్తిలో రోజురోజుకు చలనం రావడంతో అమ్మప్రేమే పునర్జన్మ నిచ్చిందని స్థానికులు చర్చించుకుంటున్నారు.

ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా పిల్లలమర్రిలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గంధం సైదమ్మకు ఇద్దరు కుమారులు. భర్త కొన్నేండ్ల క్రి తం అనారోగ్యంతో మృతి చెందాడు. పెద్ద కు మారుడు సాయి డిగ్రీ పూర్తి చేయగా, చిన్న కుమారుడు కిరణ్ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతున్నాడు. జూన్ 26న కిరణ్‌కు వాం తులు, విరేచనాలు కావడంతో సూర్యాపేట ఏరియా దవాఖానకు తీసుకెళ్లారు.వైద్యుల సలహా మేరకు జూన్ 28న హైదరాబాద్ కామినేని వైద్యశాలకు తీసుకెళ్లి చికిత్స అందించారు. అనంతరం 29న వనస్థలిపురంలోని ఓ వైద్యశాలకు తీసుకొచ్చారు. మూడురోజుల పాటు చికిత్స అందించిన వైద్యులు పరిస్థితి విషమించిందని, బ్రెయిడెడ్ అయ్యాడని తెలిపారు. వెంటిలేటర్ తీస్తే చనిపోతాడని చెప్పి ఈ నెల 3న డిశ్చార్జ్ చేశారు. సమాచారం అందుకున్న బంధుమిత్రులు ఈ నెల 3న ఖననం చేసేందుకు గ్రామంలో ఏర్పాట్లు చేశారు.

అంబులెన్స్‌లో ఇంటికి చేరిన కిరణ్‌కు వెంటిలేటర్ తొలగించినా ఊపిరాడుతూ గుండె కొట్టుకుంటుండడంతో అంత్యక్రియలను మరుసటి రోజుకు వాయిదా వేశారు. ఈ నెల 4న ఖననం చేసేందుకు సిద్ధమవుతుండగా తల్లి సైదమ్మ మిన్నంటిన రోదనలతో కిరణ్.. కిరణ్ అంటూ గట్టిగా పిలవడంతో అతడి కంట నుంచి నీరు కారింది. దీంతో హైదరాబాద్‌లోని వైద్యుల సూచనతో గ్రామానికి చెందిన ఆర్‌ఎంపీ వైద్యం అందించగా కిరణ్‌లో కదలికలు వచ్చాయి. చూడటం, మాట్లాడటం మొదలు పెట్టాడు. ప్రస్తుతం మంచంపై కూర్చుంటున్నాడు.. ద్రవపదార్థాలు తాగుతున్నాడు. చనిపోయాడనుకున్న కొడుకు బతకడంతో ఆ తల్లి, కుటుంబసభ్యులతోపాటు గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat