రైతు అంటే లాభనష్టాలు బేరీజు వేసుకునే వృత్తి కాదు. అదో జీవన శైలి. పదిమందికి పట్టెడన్నం పెట్టే బతుకులకు వెలుగునిచ్చావు. శ్రీనివాసుడు నింగి నుంచి పంపిన వేగుచుక్కలా మామధ్య మెరిసి శ్రీవారి చెంతకే చేరావు. నీ ఆశయాలే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాయన్నా అంటూ టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవీ సుబ్బారెడ్డి నాటి స్మృతులను స్మరించుకున్నారు.
దివంగత నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 70వ జయంతి సందర్భంగా తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఆయన చిత్రపటానికి పూలతో నమస్సుమాంజలి ఘటించారు. రాజకీయాలను హుందాగా నడిపిన గొప్ప నేత రాజన్న… నేడు భ్రష్టు పట్టిన రాజకీయాలను సమూలంగా మార్చేందుకు జగన్ మోహన్‌రెడ్డిని మనకు అందించారు.
ఆ మహా నాయకుడి జయంతిని ప్రభుత్వం రైతు దినోత్సవంగా ప్రకటించింది. నేడు వాడవాడలా జనం గుండెల్లో మారుమోగుతున్న రాజన్న నామం ఏడు కొండలను తాకి పునీతమై రాష్ట్రం సుభిక్షం కావాలని కోరుకుంటూ సుబ్బారెడ్డి కేకును కోసి ఆనందాలను పంచుకున్నారు.
– టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయం నుంచి విడుదల
Post Views: 273