తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ముఖేష్ గౌడ్(60) కన్నుమూశారు. గత కొద్ది రోజులుగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ముఖేష్ గౌడ్.. జూబ్లీహిల్స్ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ముఖేష్ గౌడ్ మృతిపట్ల కాంగ్రెస్ నాయకులు, ఇతరులు సంతాపం ప్రకటించారు. గత 30 ఏండ్ల నుంచి ముఖేష్ గౌడ్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నారు.
