ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాబాయ్ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో అనుమానితుడైన కసనూరు పరమేశ్వర్‌రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకున్నారు. డీఎస్పీ కార్యాలయానికి తీసుకెళ్ళి ప్రశ్నించారు. అయితే, పరమేశ్వర్‌రెడ్డికి నార్కో పరీక్ష జరిపేందుకు అనుమతి ఇవ్వాలంటూ పోలీసులు పిటిషన్ వేయడంతో పులివెందుల కోర్టు అనుమతి ఇచ్చింది. దాంతో పరమేశ్వర్‌రెడ్డితోపాటు ఇప్పటికే కోర్టు అనుమతిచ్చిన రంగన్న, ఎర్ర గంగిరెడ్డిని నార్కో అనాలసిస్ పరీక్ష కోసం గుజరాత్‌కి తరలించారు. త్వరలోనే అసలు హంతకులు బయటకు రానున్నారని తెలుస్తుంది.