ఆర్‌ఎక్స్ 100 హీరో కార్తికేయ ఆ సినిమాతో తనదైన శైలిలో సూపర్ హిట్ కొట్టి మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత వచ్చిన హప్పీ చిత్రం లో మల్లా కొంచెం జోరు తగ్గింది. అయితే ప్రస్తుతం ఈరోజు గుణ 369 తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు కార్తికేయ. ఈ చిత్రం మంచి యాక్షన్ ఎంటర్టైనర్ గా రిలీజ్ అయ్యింది. మరి ఈ చిత్రం హిట్ టాక్ అందుకుందా లేదా అనేది ఒకసారి గమనిద్దాం.
ఇక చిత్రం విషయానికి వస్తే ఇది ఒక యాక్షన్ డ్రామా, ఇందులో ముఖ్య పత్రాలు కార్తికేయ, అనఘ, మహేష్, ఆదిత్య, నరేష్, హేమ. ఈ చిత్రానికి గాను చైతన్ భరద్వాజ సంగీతం అందించారు. అర్జున్ జంద్యాల ఈ చిత్రాన్ని దర్శించగా.. అనిల్, తిరుమల్ రెడ్డి, ప్రవీణ కడియాలు దీనిని నిర్మించారు.
ఇక కధ విషయానికి వస్తే.. హీరో గుణ (కార్తికేయ) ఒక సాదారణ కుర్రాడు. ఎలాగైనా ఇంజనీరింగ్ పాస్ అయ్యి తన తండ్రి ఆశయాలను తీర్చాలి అనుకుంటాడు. ఈ క్రమంలోనే వాళ్ళ కాలనీలో అందరికి సహాయం చేస్తూ మంచి పేరు తెచ్చుకున్నాడు. అదే సమయంలో హీరోయిన్ గీత (అనఘ) అనే అమ్మాయితో హీరో లవ్ లో పడతాడు. గుణ మంచి కుర్రోడు కాబట్టి అమ్మాయి కూడా తనని ఇష్టపడుతుంది. ఇలా హ్యాపీగా సాగిపోతున్న సమయంలో గుణ తన స్నేహితుడికి సహాయం చేయబోయి ఇబ్బందుల్లో పడతాడు. ఒక రౌడీ హత్య కేసులో గుణ జైలుకు వెళతాడు. అంతే ఇంక అప్పటివరకు హ్యాపీగా ఉన్న తన జీవితం ఒక్కసారిగా తన కుటుంబంతో సహా ప్రమాదంలో పడతారు. అయితే ఈ సమస్యలను గుణ ఎలా ఎదుర్కుంటాడు? అసలు ఆ రౌడీ ఎవరూ? గుణ ని ఏం చేస్తారు అనేదే స్టొరీ..!
ప్లస్ పాయింట్స్:
*స్టోరీ
*క్లైమాక్స్
*యాక్షన్
మైనస్ పాయింట్స్:
*లవ్