జమ్మూకాశ్మీర్ కు సంబంధించిన ఆర్టికల్ 370ను రద్దు చేసి రాష్ట్ర హోదాతో పాటు ప్రత్యేక చట్టాన్ని ప్రధానమంత్రి మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రద్దుచేసి అసెంబ్లీ వ్యవస్థ ఉన్న కేంద్రపాలితప్రాంతంగా చేసిన సంగతి విదితమే..అయితే తాజాగా ప్రధాని మోదీ హోమ్ మంత్రి అమిత్ షా తర్వాత టార్గెట్ పాకిస్థాన్ అక్రమితప్రాంతమని సమాచారం.. ఈ క్రమంలో అమిత్ షా మాట్లాడుతూ జమ్మూకాశ్మీర్ ముమ్మాటికీ భారత్లో అంతర్భాగమే. పీఓకే ,ఆక్సాచిన్ కూడా ఇండియాలో భాగమని ఆయన అన్నారు. అవసరమైతే పీఓకే కోసం ప్రాణ త్యాగానికైనా సిద్ధమని అన్నారు.. అయితే జమ్మూకాశ్మీర్ విభజన బిల్లును లోక్ సభలో ప్రవేశపెట్టిన సందర్భంగా నిరసన వ్యక్తం చేసిన కాంగ్రెస్ పార్టీ సభ్యులపై అమిత్ షా ఆగ్రహాం వ్యక్తం చేశారు..
