Home / ANDHRAPRADESH / జగన్ నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాల తీరుపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే..!

జగన్ నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాల తీరుపై దరువు ఎక్స్ క్లూజీవ్ సర్వే..!

ఉమ్మడి ఏపీ విభజన తర్వాత నవ్యాంధ్రలో జరిగిన తొలి సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన అప్పటి ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలో టీడీపీ సర్కారు హాయాంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయో మనందరికీ తెల్సిందే. గత ఐదేండ్లుగా జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో ఒకవైపు ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలనే కాకుండా ఏకంగా ఆ పార్టీ అధ్యక్షుడు, అప్పటి ప్రధాన ప్రతిపక్ష నేత ,ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డితో సహా అందరీ నోళ్లను మూయించడమే కాకుండా ఏకంగా సభ నుండి సస్పెండ్ చేసిన పలు సంఘటనలు మనం గమనించాము. అయితే ఇటీవల జరిగిన జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన వైసీపీ నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాలు ఎలా జరిగాయి..

అసెంబ్లీ జరిగిన తీరుపై ప్రజల అభిప్రాయం ఏమిటి అని ఇలా పలు అంశాల వారీగా ఆన్ లైన్ వెబ్ మీడియా సంచలనం దరువు.కామ్ ఒక ప్రముఖ సర్వే సంస్థతో ఒక సర్వేను నిర్వహించింది.. ఈ సర్వేలో మొత్తం సుమారుగా యాబై వేలమందికిపైగా ప్రజల అభిప్రాయాన్ని సేకరించడం జరిగింది. ఈ సర్వేలో ముఖ్యమంత్రి జగన్ నాయకత్వంలో అసెంబ్లీ జరిగిన తీరుపై ప్రజల అభిప్రాయాన్ని అడగ్గా వీరిలో 80% మంది అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు బాగుందన్నారు.. 16% మంది మాత్రం అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరు బాగోలేదని అన్నారు. అయితే 4% మంది మాత్రం గత యాబై రోజుల్లో అసెంబ్లీ సమావేశాలు జరిగిన తీరుపై పర్వాలేదు అని తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

మొదట బాగుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన 80% మంది ప్రజలు జగన్ నేతృత్వంలో అసెంబ్లీ సమావేశాలు చాలా ఆర్ధవంతంగా .. గత టీడీపీ ప్రభుత్వంలో జరిగిన తీరుకు పూర్తి భిన్నంగా జరిగాయి. ప్రతి రోజు ఒక పక్క ప్రజల సమస్యలపై చర్చలు జరుపుతునే మరోవైపు గత ఐదేండ్లలో టీడీపీ హాయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై ముఖ్యమంత్రి జగన్ , మంత్రులు పక్కా ఆధారాలతో అసెంబ్లీ సాక్షిగా నిరూపిస్తూ సభలో ఉన్నవాళ్లకే కాకుండా సమావేశాలు ప్రత్యేక్షంగా చూస్తున్న.. బయట టీవీలల్లో చూస్తున్న ప్రజలకు ఆర్ధమయ్యేలా వివరించడం బాగుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఒకపక్క తాము ఏమి చేస్తున్నాం.. భవిష్యత్తులో ఏమి చేయబోతున్నాం అని వివరిస్తూనే మరోపక్క టీడీపీ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలను వెలుగులోకి తీసుకురావడం ముఖ్యమంత్రి హోదాలో జగన్ విజయవంతమయ్యారు అని దరువు నిర్వహించిన సర్వేలో మెజారిటీ ప్రజలు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు…

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat