బీజేపీలోకి పది మంది ఎమ్మెల్యేలు చేరడం ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో పెనుసంచలనం సృష్టిస్తుంది. ఈ క్రమంలో సిక్కిం రాష్ట్రంలో డెమోక్రటిక్ ఫ్రంట్ కి చెందిన పది మంది ఎమ్మెల్యేలు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. పది ఎమ్మెల్యేలు ఒకేసారి బీజేపీలో చేరడంతో మాజీ సీఎం,ఎస్డీఎఫ్ అధినేత పవన్ కుమార్ ఛామ్లింగ్ కు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సిక్కిం డెమోక్రటిక్ ఫ్రంట్ తరపున పదిహేను మంది గెలుపొందారు. తాజాగా పది మంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ఐదుగురు మాత్రమే మిగిలిపోయారు.
