ఏపీ ప్రధాన ప్రతిపక్ష నేత ,టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పటికే తెలంగాణలో టీడీపీ తుడిచిపెట్టుకుపోయిన సంగతి విదితమే. ఆ పార్టీ తరపున గెలుపొందిన ఇద్దరు ఎమ్మెల్యేలు అనాధికారకంగా అధికార టీఆర్ఎస్ లో చేరిపోవడంతో ఇక ఆ పార్టీకి అధికారకంగా ఇటు అసెంబ్లీలో అటు తెలంగాణలో టీడీపీ కనుమరుగైనట్లే.
తాజాగా ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత ,మాజీ ఎంపీ ఒకరు బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఇప్పటికే బీజేపీ జాతీయ అధిష్టానం సదరు మాజీ ఎంపీతో చర్చలు కూడా జరిపారు అని విశ్వసనీయ సమాచారం.
అంతే కాకుండా మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే కూడా బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారని రాష్ట్ర బీజేపీ అధిష్టాన వర్గాలు తెలిపాయి. ఈ నెల పద్దెనిమిది బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్దా ఆధ్వర్యంలో సదరు మాజీ ఎంపీతో సహా ఈ మాజీ ఎమ్మెల్యే టీడీపీని వీడి బీజేపీలో చేరనున్నారు అని తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో వార్తలు వినిపిస్తోన్నాయి..