ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా అమెరికా పర్యటనకు వెళ్లారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి జగన్ కు ఘన స్వాగతం పలికేందుకు ప్రవాసాంధ్రులు భారీగా ఏర్పాట్లు చేసారు.. ఇప్పటికే పలువురు జగన్ ని కలిసారు. ఈనెల 15నుంచి వారంరోజులు జగన్ అమెరికా పర్యటన కొనసాగనుంది. 24న తాడేపల్లికి తిరిగి వస్తారు. ఆగస్ట్ 17న డల్లాస్‌లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ప్రవాసాంధ్రుల కోరిక మేరకు జగన్ ప్రసిద్ధి గాంచిన డల్లాస్ కన్వెన్షన్ సెంటర్ (కే బెయిలీ హచీసన్ కన్వెన్షన్ సెంటర్) లో ప్రసంగించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే అన్ని ఏర్పాట్లు ముమ్మరంగా పూర్తయ్యాయి. అయితే జగన్ పెద్ద కూతురు హర్షకు లండన్ లోని ప్రతిష్టాత్మకమైన కేంబ్రిడ్జి వర్సిటీలో చదువుతుండగా చిన్న కుమార్తె వర్షారెడ్డి అమెరికాలోని ఒక ప్రముఖ విశ్వవిద్యాలయంలో గ్యాడ్యుయేట్ కోర్సులో చేర్పించేందుకు వెళుతున్నారు.
ఆగష్ట్ 17 మీటింగ్ అనంతరం ఏపీలో పెట్టుబడులకోసం పలువురు ప్రతినిధులతో జగన్ సమావేశమవుతారట.. అనంతరం వ్యక్తిగత పర్యటన చేస్తారట.. అయితే ఇప్పటికే టెక్సాస్ లో జగన్నామ స్మరణ మారుమ్రోగుతోంది. టెక్సాస్ రాష్ట్రంలోని ముఖ్య పట్టణాలైన డల్లాస్ , ఆస్టిన్ , హూస్టన్ , సాన్ అంటొనియా పట్టణాలలో ఎక్కడ చూసినా జగన్నామ స్మరణేనట.. తెలుగువాళ్ళు ఎక్కడ ఏ ఇద్దరూ కలిసినా డల్లాస్ లో ఆగష్టు 17 న జరగబోయే సభ గురించే మాట్లాడుకుంటున్నారు.. డల్లాస్ లో ఇప్పటికే ప్రతీ తెలుగింటికి ఆహ్వాన పత్రికలు చేరాయి.. రెస్టారెంట్లు , గ్రోసరీ స్టోరలలో పోస్టర్లు వెలిసాయి. హైవేల మీద పెద్ద పెద్ద డిజిటల్ హోర్డింగులు పెట్టడంతోపాటు వివిధ రాష్ట్రాలనుండి పార్టీలకి అతీతంగా తెలుగు కుటుంభాలు డల్లాస్ కు కదులుతున్నాయి.
యువ ముఖ్యమంత్రి పర్యటనపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. అమెరికావ్యాప్తంగా ఉన్న తెలుగు సంఘాలు ముఖ్యమంత్రి పాల్గొనబోయే సభకి హాజరవ్వాలని తమ సంఘ సభ్యులకి విజ్ఞప్తి చేసారు. ఈ సభని ప్రతిష్టాత్మకంగా తీసుకొని విజయవంతం చేయాలని, శక్తివంచన లేకుండా డల్లాస్ స్థానిక ప్రవాసాంధ్రులు చేస్తున్నారు. ఆగష్టు 17 మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 7 వరకూ జరగబోయే సభలో సాంస్కృతిక కార్యక్రమాలు ఉండడంతో అందరూ పిల్లలతో సహా హాజరవ్వాలని నిర్వాహుకులు విజ్ఞప్తి చేస్తున్నారు. అలాగే అమెరికాలో జాన్ యఫ్ కెన్నడీ ప్రెసిడెంట్ గా పోటీ చేసినప్పుడు ఎన్నికల ప్రచార సభ ఇదే స్టేడియంలో జరిగిందని, మళ్ళీ ఇన్ని సవంత్సరాల తరువాత ఇక్కడ జరగబోయే పొలిటికల్ ఈవెంట్ ఇదేనని చెప్తున్నారు.