ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. అప్పటి అధికార పార్టీ ఐన టీడీపీకి ఏపీ ప్రజలు బుద్ధి చెప్పారు. ఈ మేరకు కేవలం 23 సీట్లకే పరిమితం చేసారు. జగన్ ను మాత్రం రికార్డు మెజారిటీతో ప్రజలు గెలిపించారు. ఏకంగా 151 సీట్లతో రికార్డు సృష్టించి ఏపీలో అధికారం దక్కించుకున్నారు జగన్. ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటిరోజు నుండి తనదైన శైలిలో ముందుకు పయనిస్తున్నాడు. అయితే జగన్ తాజాగా ఒక అరుదైన ఘనత తన సొంతం చేసుకున్నారు. మోస్ట్ పాపులర్ సీఎంల జాబితాలో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి మూడో స్థానం కైవశం చేసుకున్నాడు. వీడీపీ అసోసియేట్స్ ‘దేశ్ కా మూడ్’ పేరిట నిర్వహించిన ఈ సర్వేలో దేశం మొత్తం మీద 71 శాతం మంది జగన్ పాలనపై సంతృప్తిగా ఉన్నట్లు ఈ సర్వే లో వెల్లడించారు. ఏపీలో జగన్ చేపట్టిన ‘నవరత్నాలు’ అమలుకు సంభందించి జాతీయ స్థాయిలో ఆకట్టుకున్నాయని ఈ సంస్థ ప్రకటించింది. ఇక ఈ సర్వే ప్రకారంగా ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ మొదటి స్థానంలో ఉండగా , రెండో స్థానంలో యోగీ ఆదిత్యానాథ్ ఉన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఐదో స్థానంలో నిలిచారు.
