వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటరీ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా మరోసారి చంద్రబాబు మరియు పచ్చ దొంగలపై ధ్వజమెత్తారు. కొంచెం ఆలస్యం అవ్వచ్చేమో గాని చివరికి ఎవరు చేసిన పాపం వారిని వదలదని, దీనికి ఉదాహరణ మాజీ కేంద్ర మంత్రి చిదంబరమే అన్నారు. 20 సార్లు ముందస్తు బెయిలుతో తప్పించుకున్న చివరకు జైలుకు వెళ్లక తప్పలేదు. ఇక ఎన్నో అవినీతి కేసుల్లో ఉన్న చంద్రబాబు పరిస్థితి కూడా ఇంతేనని ఎద్దేవా చేసాడు. మరోపక్కఅమరావతి నుంచి రాజధానిని తరలించేందుకే ముంపుకు గురిచేశారని గగ్గోలు పెడుతున్నవారెవరో గమనించారా? అని ప్రశ్నించారు. చంద్రబాబు, సుజనా, కేశినేని, సిఎం రమేశ్, లోకేశ్, కోడెల, ఉమ, వీళ్ల బినామీలు, “కావాల్సిన” వాళ్లు వేల ఎకరాల భూములు రైతులను మోసం చేసి కొన్నారు. రియల్ ఎస్టేట్ ధరలు పడిపోతాయన్నదే వీరి ఏడుపు. అందుకోసమే వీరంతా ఇప్పుడు కొత్త కొత్త స్కెచ్ లు వేస్తున్నారు.