ఓటమితో రగిలిపోతున్న తెలుగుదేశం వైసీపీ ప్రభుత్వంపై వీలైనంత బురద జల్లేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకు సంబంధించి పలు విధ్వంసాలకు ఒడిగట్టేందుకు టీడీపీ ప్రయత్నిస్తోందట.. తాజాగా జరుగుతున్న సమీకరణాలు చూస్తే అది కూడా వాస్తవం అనిపిస్తోంది.. ప్రతి హిందువులకు సంబంధించిన ఈవెంట్లలో క్రైస్తవమత ప్రచారం చేపించడం.. వైఎస్ఆర్సీపీ వచ్చాక క్రిస్టియానిటీ పెరిగిపోయిందని జనాలని రెచ్చగొట్టడం.. సామాన్యుడికి అందే రేషన్, పింఛన్లు పై దుష్ప్రచారం చేయడం.. రాజధాని , పోలవరం జగన్ వచ్చాక ఆగిపోయాయి అని దుమారం లేపడం.. వైఎస్ఆర్సీపీ వచ్చాక ఇతర పార్టీ కార్యకర్తలు, నాయకులపై రాజకీయ కక్షసాధింపులు పెరిగిపోయాయని రెచ్చగొట్టడం.. అన్న క్యాంటీన్లు లేక రాష్ట్రం మొత్తం అన్నమో రామచంద్ర అని ఆకలితో అల్లాడిపోతోంది అని ప్రచారం చేయడం.. రివర్స్ టెండరింగ్ ద్వారా భయపెడుతూ ఇక ఏపీలో ఎలాంటి అభివృద్ధి పనులు జరగవు అని నమ్మించడం.. అలాగే ఎక్కడ ఏ చిన్న అవాంఛనీయ సంఘటన జరిగిన నిందితుల్ని వైస్సార్సీపీ వాళ్లే అని ప్రచారం చేయడం వంటివి ఇప్పటికే చేస్తున్నారు.. ఇకపై చేసేందుకూ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీ నేతలు చంద్రబాబును చంపేందుకే డ్రోన్ తిప్పారంటూ అసత్య ప్రచారం చేసారు.. రాజధానిని ముంచేందుకే వరదలు సృష్టించారంటూ దుష్ప్రచారం చేసారు.. పెయిడ్ ఆర్టిస్టులతో ముఖ్యమంత్రినే దుర్భాషలాడించారు. తిరుమలలో అన్యమత ప్రచారం జరగుతుందంటూ మతాల మధ్య చిచ్చు రేపారు. అయినా కోడెల అసెంబ్లీ ఫర్నీచర్ దొంగతనంపై ఎవరూ మాత్రం నోరు మెదపరు.. వరదలపై పవర్ లెస్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజల్ని తప్పుదోవ పట్టించారు. ఇకపై ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు ఎంత వరకైనా తెగిస్తారంటూ టీడీపీనుద్దేశించి హెచ్చరిస్తున్నారు. కారణం చంద్రబాబు పదవి లేకపోతే ఉండలేడంటూ చురకలేస్తున్నారు.
