గురజాల టీడీపీ మాజీ ఎమ్మెల్యే యరపతినేని అరెస్టు చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. గుంటూరు జిల్లాలో మైనింగ్ అక్రమాలకు సంబంధించి ఆయనపై హైకోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు ఆయన గురజాల ఎమ్మెల్యేగా పనిచేశారు. ఆసమయంలో భారీ ఎత్తున సున్నపురాయి నిక్షేపాలను అక్రమంగా తరలించడంతో వైసీపీ మొదటినుంచి పోరాటం చేసింది. యరపతినేని అండతో ఆయన అనుచరులు కూడా పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్‌కు పాల్పడ్డారంటూ పిడుగురాళ్లకు చెందిన గురవాచారి అప్పుడే అధికారులకు ఫిర్యాదు చేశాడు. అయితే టీడీపీ అధికారంలో ఉండడంతో అధికారుల మ్యానేజ్ చేసారు. ఇక మరోపక్క మాజీ స్పీకర్ కోడెల పరిస్థితి కూడా అలానే కనిపిస్తుంది. గత ఐదేళ్ళు అధికారంలో ఉన్నామనే అహంకారంతో విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేసారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఎంపీ విజయసాయి రెడ్డి “కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు. బీజేపీలోకి జంప్ అయిన వారిని వదిలేసినా. ప్రకృతి వనరులు వాళ్ల బాబు గారి సొత్తు అన్నట్టు బెల్లం ముక్కల్లా నమిలేశారు. కలుగులోని పంది కొక్కులంతా చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు”.
కోడెల, యరపతినేని వంటి దోపిడీ దొంగలు టీడీపీలో వందల మంది ఉన్నారు. బీజేపీలోకి జంప్ అయిన వారిని వదిలేసినా. ప్రకృతి వనరులు వాళ్ల బాబు గారి సొత్తు అన్నట్టు బెల్లం ముక్కల్లా నమిలేశారు. కలుగులోని పంది కొక్కులంతా చట్టం ముందు దోషులుగా నిలబడక తప్పదు.
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 27, 2019