బాహుబలి తర్వాత ప్రభాస్ నటిస్తున్న సాహో మూవీ క్రేజీ వరల్డ్ వైడ్‌గా ఊపేస్తోంది. అభిమానులు తీవ్ర ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సాహో మూవీ ఆగస్టు 30న విడుదల అవుతుంది. దాదాపు 300 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు ఫస్ట్‌డే ఓపెనింగ్స్ భారీగా వచ్చే అవకాశం ఉంది. ఫస్ట్‌డేనే వరల్డ్‌వైడ్‌గా 100 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని సిని క్రిటిక్స్ అంటున్నారు. అయితే భారీ సినిమాలకు తొలి రోజు నుంచి 3 రోజులు, వారం రోజుల వరకు టికెట్ల ధరలు పెంచుతున్నారు ఆయా చిత్రాల నిర్మాతలు. ఇటీవల మహేష్ మహర్షి మూవీకి కూడా టికెట్ల ధరలు పెంచడంతో తెలంగాణ ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. తాజాగా సాహో మూవీ రిలీజ్ సందర్భంగా టికెట్ల ధరల పెంపు అంశాన్ని అధికారులు సీఎం జగన్‌మోహన్ రెడ్డి వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. అయితే సీఎం జగన్ టికెట్ల ధరల పెంపుపై సముఖత చూపలేదని సమాచారం. ఒక్కో సినిమాకు, ఒక్కోధర వద్దని..చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా..ఒకే ధర ఉండాలని…వినోదం కోసం వచ్చే సామాన్య ప్రజలకు ఇబ్బందులు కలిగించకూడదని సీఎం జగన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ఇటీవల సాహో మూవీ ప్రమోషన్లలో భాగంగా…ప్రభాస్..పొలిటికల్ బాహుబలి సీఎం జగన్ అని, జగన్ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ముందుకు వెళుతుందని ప్రశంసలు కురిపించాడు. ఈ నేపథ్యంలో సాహో మూవీ టికెట్ల ధరల పెంపుపై సీఎం జగన్ సానుకూలంగా స్పందిస్తాడని అంతా అనుకున్నారు. కానీ..టికెట్ల ధరలు పెంచద్దు అని చెప్పడం ద్వారా అభిమానం కంటే…సామాన్య ప్రజలే తనకు ముఖ్యమని సీఎం జగన్ మరోసారి చాటి చెప్పారు.దీంతో సాహో మూవీకి తొలి రోజు టికెట్ల ధరల పెంపుకు అనుమతించడం లేదని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా సాహో మూవీ టికెట్ల ధరల పెంపుపై తెలంగాణ ప్రభుత్వం కూడా అంగీకరించలేదు. దీంతో ఫస్ట్‌డే 100 కోట్ల కలెక్షన్లు కొల్లగొట్టాలన్న సాహో టీమ్ ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. మొత్తంగా సాహో మూవీ టికెట్ల ధరలపై పెంపుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు అంగీకరించకపోవడం…సాహో మూవీ ఫస్ట్‌డే కలెక్షన్లపై ఏ మేరకు ప్రభావితం చేస్తుందో చూడాలి.
