టాలీవుడ్ స్టార్ సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణను ఫాలో అయిండు ఈ మాజీ ముఖ్యమంత్రి. మాజీ ముఖ్యమంత్రికి ,బాలయ్యకు సంబంధం ఏంటని ఆలోచిస్తున్నారా.. అయితే అసలు ముచ్చటకు వద్దాం.. అసలు ఏమి జరిగిదంటే కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి,కాంగ్రెస్ సీనియర్ నేత సిద్ధరామయ్య మైసూర్ ఎయిర్ పోర్టు నుంచి బయటకు వస్తున్న నేపథ్యంలో ఆయన వెంట ఉన్న ఆ పార్టీ సీనియర్ కార్యకర్త ఫోన్ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. అంతే ఎక్కడ లేని కోపంతో ఊగిపోయిన సిద్ధరామయ్య అతని చెంపను చెల్లుమన్పించాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో,యూట్యూబ్లో వైరల్ అవుతుంది.
