తెలుగుదేశం సీనియర్ నేత అయ్యన్నపాత్రుడి పుట్టినరోజు నేపథ్యంలో టీడీపీ నేత, మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ రోజు విశాఖపట్నం చేరుకున్నారు. జిల్లాలోని నర్సీపట్నంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్న లోకేశ్ విశాఖనగరంలో బైక్ ర్యాలీ నిర్వహించేందుకు ప్రయత్నించారు. అయితే ఈర్యాలీకి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.. టూవీలర్ ర్యాలీ చేపట్టాలంటే అందరూ హెల్మెట్ ధరించాల్సిందేనని పోలీసులు స్పష్టం చేశారు. రూల్స్ కచ్చితంగా పాటించాలని కోరారు.. దీంతో లోకేశ్ ఆగ్రహించారు.. పోలీసులు మాట వినకపోయే సరికి పోలీసుల తీరుకు నిరసనగా లోకేశ్ కాలినడకన ఎన్టీఆర్ ఆసుపత్రి వద్దకు బయలుదేరగా, టీడీపీ శ్రేణులు వాహనాలను నడిపించుకుంటూ ఆయన వెంట నడిచారు. అయితే గతంలో ప్రత్యేకహోదా కోసం విద్యార్ధులు చేపట్టిన ఉద్యమాన్ని అడ్డుకోవడంతో ఇప్పుడు లోకేశ్ కు తగిన శాస్తి జరిగిందంటూ విద్యార్ధులు చెప్తున్నారు. అలాగే లోకేశ్ పాదయాత్ర చేస్తే ఆయనను వెంబడించాలని అంతేకానీ ఏదో పెట్రోల్ రేట్లపై నిరసన తెలియచేస్తున్నట్టు బైకులు నడిపించుకుంటూ వెళ్లటమేంటని నవ్వుకుంటున్నారు.
