గత ఐదేళ్ళ పాలనలో రాష్ట్రం లోటు బడ్జెట్ లో ఉందని చెప్పి వేల కోట్లు నొక్కేసినా ఘనత చంద్రబాబుదే. ఎన్నో మాయమాటలు చెప్పి ప్రజల నమ్మకాలను తాకట్టు పెట్టి తీర గెలిచిన తరువాత ప్లేట్ తిప్పేసాడు. కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన సొమ్మును కనీసం 10 శాతం కూడా ఖర్చు పెట్టలేదు. మిగాత సొమ్మును బాబుగారే నొక్కేసారు. రాష్ట్రం మొత్తం అప్పుల్లో ఉంది నిధులు లేవని చెప్పిన చంద్రబాబు ఎన్నికలకు ముందు డ్వాక్రా మహిళల ఖాతాల్లో డబ్బులు ఎలా వేసారు. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి వరదలొచ్చిన ప్రతిసారి వేల మంది నిరాశ్రయులవుతారు. ఇళ్లూ,పంటలు దెబ్బతింటాయి. ఇది మనకు కనిపించే విషాద దృశ్యం. కానీ చంద్రబాబు గారికి వరదలు తెచ్చే ఇసుక కనక వర్షం కురిపిస్తుంది. దోచుకున్న సొత్తులో కొంతయినా బాధితులకు అందజేసి ఆదుకోండి బాబు గారు. లేక పోతే లావై పోతారు అని అన్నారు.
