తన చెల్లికోసం ఈ బుడతడు చేసిన పనికి నెటిజన్లంతా ఫుల్ ఫిదా అయ్యారు. అంతేకాకుండా ప్రతి అన్నయ్య చెల్లెకు ఇలాగే ప్రేమానురాగాలు పంచాలని కోరుతూ షేర్లు కొడుతూ.. పోస్టులు పెడుతున్నారు. అసలు విషయానికి ఆ చెల్లెకి ఆకలైంది. ఇదే విషయం తన అన్నయ్యకు చెప్పింది. అంతే అంత చిన్న వయస్సులో అమ్మనాన్న కోసం ఎదురుచూడటం. ఎవరో ఏదో పెడతారని ఆశ పడటం.. ఎదురు చూడటం కరెక్టు కాదేమో అనుకున్నాడు. అంతే ఇక గుడ్లు తెచ్చి తను గరిట పట్టుకుని వంట చేశాడు. తెచ్చిన సామాన్లతో చక్కని ఆహారాన్ని తయారు చేశాడు. వయస్సుకు మించిన భారంలో ఎంతో కష్టంతో చేసిన ఆహరాన్ని గోరుముద్దలుగా తన చెల్లికి తినిపించి వహ్వా అనిపించుకున్నాడు ఈ బుడతడు.. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతుంది.