ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌రావు మరణంపట్ల అన్ని రాజకీయ పార్టీలు రాజకీయాలకు ప్రగాఢ సంతాపం తెలిపాయి. అయితే చంద్రబాబుతో సహా టీడీపీ నేతలు కోడెలపై వరుసగా కేసులు పెట్టి వేధించడం వల్లే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని, ఇది ప్రభుత్వ హత్య అంటూ వైసీపీ ప్రభుత్వంపై, సీఎం జగన్‌పై దుష్ప్రచారం చేస్తున్నారు. ఎల్లోమీడియా ఛానల్స్ అన్నీ కోడెలను ప్రభుత్వమే బలితీసుకుందంటూ వైసీపీపై అసత్యకథనాలు ప్రసారం చేస్తున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబు గుట్టు బయటపెట్టాడు. కోడెల గారి మరణాన్నీ రాజకీయం చేసి ఆత్మశాంతి లేకుండా వేధిస్తున్నారని, తను కొనుగోలు చేసిన 23 మంది వైఎస్సార్సీపీ ఎమ్మేల్యేలను అనర్హులు చేయకుండా చంద్రబాబు ఆయనను వాడుకుని వదిలేశాడని అన్నారు. నమ్మిన వారు ఆపదలో తనకు అండగా నిలవలేదన్న నిస్పృహతోనే ఆయన ఆత్మహత్యకు పాల్పడ్డారని చెప్పుకొచ్చారు. తన సొంత అవసరాలకోసం ఎలాంటి వ్యక్తినైనా వాడుకొని వదిలేయడం చంద్రబాబుకు అలవాటే ఎందుకంటే ఎన్టీఆర్ గారినే నమ్మించి మోసం చేసిన చంద్రబాబుకి ఇవి చాలా చిన్న విషయాలని అన్నారు. అతను చేసిన ట్వీట్ కు ఇంతకన్నా సాక్షాలు ఏమి కావాలంటూ కామెంట్స్ పెడుతున్నారు.
