దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం తీసుకున్నారు. ఆమెతో కల్సి భోజనం చేశారు. అనంతరం తల్లితో కాసేపు మాట్లాడారు. జన్మదినం సందర్భంగా మోదీకి ఆయన తల్లి హీరాబెన్ రూ.501లు బహుమతిగా ఇచ్చారు.
