బిగ్ బాస్ నేటి ఎపిసోడ్‌లో గొడవలు జరగనున్నట్టు తెలుస్తోంది. బెస్ట్ ఫ్రెండ్స్ వరుణ్-రాహుల్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఏంటి? కొడతావా.. అంటూ వరుణ్ సీరియస్ అవగా రాహుల్ కూడా తన నోటి దురుసును ప్రదర్శించినట్టు కనిపిస్తోంది. పరిస్థితి చేయి దాటుతుందని భావించిన వితిక.. గొడవను సద్దుమణిగేలా ప్రయత్నించింది. అయితే గోరంత విషయాన్ని కొండంత చేసి చూపిస్తారు తప్పితే అక్కడ ఏమీ ఉండదని నెటిజన్లు అంటున్నారు. మరి వీరి గొడవ టాస్క్ కోసమేనా లేక తర్వాత కూడా కొనసాగుతుందా అనేది నేటి ఎపిసోడ్‌లో తేలనుంది!