మిల్కీ బ్యూటీ తమన్నా ఎప్పటికీ ఒకే ఫామ్ ని కొనసాగిస్తుంది. తన నటనతో, డాన్స్ తో ఫ్యాన్స్ ను తన పక్కకి తిప్పుకుంది. బాహుబలి సినిమాకు ముందు వరకు కూడా ఒక రేంజ్ ఉన్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత నుంచి ఫామ్ ను కోల్పోయిందనే చెప్పాలి. ఇంకా చెప్పాలంటే ఐటమ్ సాంగ్స్ కే పరిమితం అవుతుందేమో అని చెప్పాలి. ప్రస్తుతం టాలీవుడ్ లో యంగ్ హీరోయిన్ల హవా నడుస్తుంది. దాంతో సీనియర్స్ వెనక్కి తగ్గక తప్పడంలేదు.ఇక అసలు విషయానికి వస్తే ఇప్పుడు నడుతున్న ట్రెండ్ లో డైరెక్టర్స్ అందరు యంగ్ హీరోయిన్లు కోసం చూస్తుంటే ఒక్క డైరెక్టర్ ఇప్పుడు కూడా తమన్నానే కోరుకుంటున్నాడు. అతడే డైరెక్టర్ సంపత్ నంది. మొదట రచ్చ సినిమాలో తమన్నని ఎన్నుకున్న డైరెక్టర్ అనంతరం బెంగాల్ టైగర్ సినిమాలో కూడా పట్టు బట్టి తమన్ననే ఎన్నుకున్నాడు. ఇప్పుడు ఈ డైరెక్టర్ కు గోపీచంద్ తో సినిమా ఓకే అయ్యింది. ఇక ఇందులో కూడా తమన్నాను పెట్టాలని డైరెక్టర్ అభిప్రాయపడ్డాడు. దాంతో డైరెక్టర్ పై సెటైర్ల వర్షం కురిపిస్తున్నారు నెటీజన్లు. ఎందుకు ఇంతగా మిల్కీ బ్యూటీ పై కన్నేసావని ప్రశ్నిస్తున్నారు.
