వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుపై తనదైన శైలిలో విరుచుకుపడ్డారు.కోడెల స్మారక సభలో కూడా చంద్రబాబు పోలవరం రివర్స్ టెండరింగునే కలవరించాడని అన్నారు. గతంలో 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా ఇప్పుడు తక్కువకు ఎలా కోట్ చేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడింది మీరే కదా అని ప్రశ్నించాడు. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు, అదీ తేడా అని వివరించారు.మరో ట్వీట్ లో అనుభవజ్ణుడని నమ్మి ప్రజలు గెలిపిస్తే చంద్రబాబు చేసిన దుర్మార్గాలు అన్నీ ఇన్నీ కావు. ఎన్టీపీసీ సహా విద్యుత్తు సంస్థలకు 20 వేల కోట్లపైనే బకాయిలు పెట్టి పోయాడు. జెన్‌కోను ధ్వంసం చేసి ప్రైవేటుకు దోచిపెట్టాడు.డిస్కమ్‌లను అప్పుల్లో ముంచి ఇప్పుడు చీకటి రోజులొచ్చాయని దొంగ ఏడుపు మొదలెట్టాడు అని అన్నారు.
కోడెల స్మారక సభలో కూడా @ncbn పోలవరం రివర్స్ టెండరింగునే కలవరించాడు. గతంలో 650 కోట్లు ఎక్కువ కోట్ చేసిన మేఘా ఇప్పుడు తక్కువకు ఎలా కోట్ చేస్తుందని గగ్గోలు పెడుతున్నాడు. కమిషన్ల కోసం కక్కుర్తి పడింది మీరే కదా. ఇప్పుడు ఎవరికీ రూపాయి కూడా ఇవ్వనవసరం లేదు. అదీ తేడా. @AndhraPradeshCM
— Vijayasai Reddy V (@VSReddy_MP) October 1, 2019