ఏపీలో గతంలో ఎన్నడూ లేనంతగా జగన్ సర్కార్ ఒకేసారి 1.26 లక్షల గ్రామవాలంటీర్లు, గ్రామ సచివాలయం ఉద్యోగాలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. అతి తక్యువ వ్యవధిలోనే పకడ్బందీగా పరీక్షలు నిర్వహించి, ఇటీవల తుదిఫలితాలను ప్రకటించింది. అంతేకాకుండా సెప్టెంబర్ 30న నియామక పత్రాలు కూడా ఇవ్వడం జరిగింది.ఇంత తక్కువ సమయంలో జాబులు తీయడంతో జీర్ణించుకోలేకపోతున్న చంద్రబాబు బురద జల్లుతున్నారు. దీనిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా చంద్రబాబుకు చుక్కలు చూపించాడు.”ఒక్క నోటిఫికేషన్‌తో 1.27 లక్షల ఉద్యోగాలు వచ్చాయి. ఇక ప్రతి ఏటా నియామకాలు ఉంటాయని ఏపీ సీఎం జగన్ ప్రకటించారు. బిగ్గరగా ఏడవండి చంద్రబాబు గారు అని అన్నాడు. మీ శాపనార్థాలు నిరుద్యోగులకు ఆశీర్వాదాలుగా మారతాయి అని అన్నారు. 1000 నిరుద్యోగ భృతి రోజులు పోయి ఉద్యోగులుగా గర్వించే రోజులు వచ్చాయి అని అన్నారు.