జక్కన్న ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆర్ ఆర్ ఆర్’. ఇందులో కొమరం భీమ్ గా జూనియర్ ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా రాంచరణ్ నటిస్తున్న విషయం అందరికి తెలిసిందే. జక్కన్న తీస్తున్న ఈ చిత్రంలో పాత్రలు వేరువేరు ప్రాంతాలకు సంభంధించినవి. అల్లూరి ఆంధ్రాకి సంభందించిన వ్యక్తి కాగా కొమరం భీమ్ తెలంగాణ. వీరిద్దరూ ఎక్కడ పోరాటం చేసినప్పటికీ వీరిని కలుపుతూ రాజమౌళి సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఆ సన్నివేశం ఎలా ఉండబోతుంది అనే విషయానికి వస్తే..వీరిద్దరూ అనుకోని సంఘటనలో కలుసుకుంటారు. ఒక చిన్న పాపను కాపాడే సమయంలో ఎన్టీర్ కి దెబ్బ తగులుగుతుంది. ఆ సమయంలో వీరు కలుసుకుంటారు. అప్పుడే వీరి పరిచయం మొదలవుతుంది…అంతేకాకుండా వీరిద్దరి గమ్యం ఒక్కటే కావడంతో అప్పటినుండి ఇద్దరూ కలిసి అంగ్లేయులపై పోరాటానికి సిద్దమవుతారు. ప్రస్తుతం ఆ సన్నివేశాన్ని ఎంతో పకడ్బందీగా డైరెక్టర్ రాజమౌళి తీస్తున్నారు.ఈ సన్నివేశం చిత్రానికే హైలైట్ గా నిలుస్తుందని చిత్ర యూనిట్ భావిస్తుంది.
