బీసీసీఐ చీఫ్ గా పదవీ బాధ్యతలు చేపట్టకముందే ఐసీసీకు తొలి వార్నింగ్ బెల్ మ్రోగించాడు సౌరవ్ గంగూలీ. కెప్టెన్ గా.. ఓపెనర్ గా టీమిండియాకు దూకుడు నేర్పిన దాదా తన తొలి అస్త్రాన్ని ఐసీసీపై ప్రయోగించబోతున్నాడు. బీసీసీఐ అధ్యక్షుడిగా పదవీ బాధ్యతలు స్వీకరించబోతున్న తరుణంలో సౌరవ్ గంగూలీ జాతీయ మీడియాకు ఇంటర్వూ ఇచ్చాడు.
ఈ ఇంటర్వూలో దాదా మాట్లాడుతూ” కొద్ది కాలం ముందు వరకు బీసీసీఐ ఐసీసీ నుండి భారీ మొత్తంలో రెమ్యూనేషన్ ను దక్కించుకునేది. కానీ ఆ తర్వాత మాత్రం చాలా వెనకబడిపోయింది. ఇప్పుడు తన ముందు ప్రధాన కర్తవ్యం ఐసీసీ నుండి బీసీసీఐ కి రావాల్సిన రెవిన్యూ వాటాను సాధించడమే. ఆరు నూరైన సరే బీసీసీఐకి రావాల్సిన వాటాను పూర్తి మొత్తంలో సాధించి తీరుతాం.
ఓవరాల్ గా ఐసీసీకి వచ్చే ఆదాయంలో ఒక్క బీసీసీఐ నుంచే 75-80% ఆదాయం వెళ్లుతుంది. కానీ బీసీసీఐకి రావాల్సిన వాటా మాత్రం రావడం లేదు. దీనికి తగ్గట్లు పంచాల్సిన వాటాను వచ్చేలా పని చేస్తాను “అని దాదా ఆ ఇంటర్వూలో పేర్కొన్నాడు.