Home / MOVIES / బిగ్ బాస్ టైటిల్ విన్నర్..అభిమానులు ఎక్కవగా ఉన్నది ఒక్కరికే

బిగ్ బాస్ టైటిల్ విన్నర్..అభిమానులు ఎక్కవగా ఉన్నది ఒక్కరికే

తెలుగు టీవీ ప్రేక్షకులను 90 రోజులకు పైగా ఎంతగానో అలరిస్తున్న రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 3 ఈ వారంలో ముగియనుంది. ఈ సందర్భంలో సీజన్ 3 ఫైనల్ ని చాలా ఘనంగా జరపాలని షో నిర్వాహకులు ఇప్పటికే భారీగా ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. మరికొద్ది రోజుల్లో సీజన్ 3 టైటిల్ విన్నర్ ప్రకటించే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ టోపీ అందించడానికి మెగాస్టార్ చిరంజీవి అతిథిగా వస్తున్నట్టు తెలుస్తోంది. నాగార్జున, చిరంజీవి ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటారు. ఈ నేపథ్యంలోనే నాగార్జున ఫైనల్ ఎపిసోడ్‌కు గెస్ట్‌గా హాజరు కావాలని చిరంజీవిని కోరగా చిరు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మరి ఈ సారి చిరు చేతుల మీదుగా టైటిల్ ట్రోఫీ తీసుకునే అదృష్టం ఎవరికి ఉందో చూడాలి. ఇకపోతే బిగ్ బాస్ టైటిల్ విన్నర్ రేసులో ఎక్కువగా రాహుల్ మరియు శ్రీముఖి, బాబా భాస్కర్ ల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ ఎక్కువగా రాహుల్ కు బయట ఫ్యాన్స్ ఉన్నట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో బిగ్ బాస్ టైటిల్ విన్నర్ ఖచ్చితంగా రాహూల్ నే అంటూ హల్ చల్ చేస్తున్నారు.