టాలీవుడ్ వివాదస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ మరోసారి వార్తల్లోకి ఎక్కాడు. ఎప్పుడూ వివాదాలకు కేర్ అఫ్ అడ్రస్ గా నిలిచే వర్మ చంద్రబాబునే టార్గెట్ చేస్తునాడని అందరికి తెలిసిందే. ప్రస్తుతం కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాతో బరిలోకి వచ్చిన వర్మ మొన్ననే ఈ చిత్ర ట్రైలర్ కూడా రిలీజ్ చేసాడు. అయితే ఈరోజు ట్విట్టర్ వేదికగా మరో బాంబు పేల్చాడు. చంద్రబాబు కి సంభందించిన ఒక ఫోటో ని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేసాడు. ఈ ఫోటో లో చంద్రబాబు యోగా చేస్తూ కనిపించగా వెనుక లోకేష్ కనిపిస్తాడు. అయితే ఈ పిక్ చూస్తున్న ప్రేక్షకులు విచిత్రమైన కామెంట్స్ చేస్తున్నారు. ఈ పిక్ లో ఎన్నో అర్ధాలు వెతకొచ్చని అంటున్నారు. ఈ పిక్ పరంగా చూస్కుంటే బాబు అధికారంలో ఉన్నప్పుడు యోగాలోనే ఉన్నారు, ఇప్పుడు అధికారం లేనప్పుడు అలానే ఉంటారు, చివరికి రాజకీయ సన్యాసం చేసి పూర్తిగా యోగాలో నిమగ్నం అయిపోతారేమో పాపం అని అంటున్నారు.
A pic from the highly non controversial film KAMMA RAJYAMLO KADAPA REDDLU #KRKR pic.twitter.com/U13BOyWqez
— Ram Gopal Varma (@RGVzoomin) October 30, 2019