ప్రస్తుతం అతితక్కువ సమయంలో మంచి ఫేమస్ అయిన హీరో ఎవరంటే విజయ్ దేవరకొండ అనే చెప్పాలి. హీరోగా ఫేమస్ అయిన అతడు బిజినెస్ లో కూడా అడుగుపెట్టాడు. అంతేకాకుండా మీకు మాత్రమేచెబుతా సినిమా నిర్మాత కూడా అతడే. మామోలుగా అయితే అతడి సినిమాలకు ప్రమోషన్లు ఎలా ఉంటాయో అందరికి తెలుసు. ఇక ఇది తన సొంత డబ్బు కాబట్టి ఈ విధంగా కూడా చేస్తున్నాడు. అసలేం చేసాడంటే ప్రసాద్ మల్టీప్లెక్స్ లో టికెట్ కౌంటర్ దగ్గర ప్రేక్షకులకు టికెట్లు ఇస్తూ వారిని ప్రోత్సహించాడు. అంతేకాకుండా మరియు బహుమతి పొందిన సినీ ప్రేక్షకులకు ఉచిత పాప్‌కార్న్ మరియు పానీయం కూపన్లు ఇవ్వడం జరిగింది.
