ఇప్పటివరకు తాను తీసిన ఒక్క చిత్రం కూడా ఫ్లాప్ అవ్వని దర్శకుడు ఎవ్వరైనా ఉన్నాడు అంటే అది రాజమౌళి అనే చెప్పాలి.టాలీవుడ్ కీర్తిని ప్రపంచం మొత్తానికి చాటి చెప్పాడు. బాహుబలి చిత్రంతో రికార్డులు బ్రేక్ చేసాడు. ఇప్పుడు అదే రీతిలో సుమారు 300కోట్లు భారీ బడ్జెట్ తో సినిమా తీస్తున్నాడు. ఇందులో టాప్ హీరోలు రాంచరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే మామోలు విషయం కాదనే చెప్పాలి. ఈ చిత్రం జూలై 30, 2020 లో విడుదల చెయ్యాలని దర్శకుడు ఎప్పుడో నిర్ణయించాడు. ఇంకా చెప్పాలి అంటే హీరోలు విషయంలో ఎలాంటి సీన్స్ లీక్ అవ్వకుండా ఉండేలా జాగ్రత్త పడుతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించి స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మరియు కొమరం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ లుక్ రిలీజ్ అని చెప్పిన యూనిట్ దానికి కూడా నిరాకరించింది. చివరిగా ఇప్పుడు వచ్చే ఏడాది హీరోల పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ లుక్ కు విడుదల చెయ్యాలని నిర్ణయించినట్లు తెలుస్తుంది. అలా అయితే రామ్ చరణ్ బర్త్ డే ముందు ఉండడంతో అతనిదే ముందు వస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి.
