ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమత్రి చంద్రబాబు నాయుడు గారు ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో ఆయనకే అర్ధం కావడంలేదు. గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు చేసిన దౌర్జన్యాలు, అన్యాయాలు అన్నీ ఇన్ని కాదు. రైతులను సైతం నట్టేటిలో ముంచేసాడు. ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు దారుణంగా ఓడిపోవడంతో మరియు జగన్ అఖండ మెజారిటీతో గెలవడంతో బాబుకి ఎక్కడాలేని కుళ్ళు కుతంత్రాలు మొదలయ్యాయి. జగన్ సీఎంగా ప్రమాణస్వీకారం చేసినప్పటినుండి ఇప్పటివరకు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఏం చేయలేకపోయాడు. నిన్న బాబు చేసిన దీక్ష కూడా తుస్సుమంది. దీనిపై ట్విట్టర్ వేదికగా స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి “ఇసుక కొరత తీర్చాలంటూ చేసిన దీక్షలో మెడకు ఇసుక పొట్లాల దండ వేసుకున్నాడు. ఎప్పుడైనా కరువు పైన దీక్ష చేయాల్సి వస్తే ఎముకల హారం చుట్టుకునేలా ఉన్నాడు. ఫ్రస్ట్రేషన్లో ఏం చేస్తున్నాడో తెలియట్లేదు. ఫ్లెక్సీలు, పోస్టర్లు, జెండాలు కట్టినంత మంది కూడా దొంగ దీక్షకు హాజరు కాలేదు” అని అన్నారు.
