టాలీవుడ్ సూపర్ స్టార్ ప్రిన్స్ మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రష్మిక మంధాన హీరోయిన్ గా .. సీనియర్ నటి విజయశాంతి కీలకపాత్రలో అనిల్ సుంకర,దిల్ రాజు సంయుక్తంగా జనవరి పన్నెండో తారీఖున తెలుగు సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం సరిలేరు నీకెవ్వరు.
ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా పూర్తిచేసుకుని .. మిగిలిన పనులను పూర్తి చేసుకుంటుంది. ఈ క్రమంలో ఈ మూవీకి చెందిన టీజర్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది అని దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు.
సంక్రాంతి కానుకగా విడుదలవుతున్న ఈ మూవీపై మహేష్ అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.
TEASER LOADING ??#SarileruNeekevvaru
Super Star @urstrulyMahesh @vijayashanthi_m @iamRashmika @RathnaveluDop @AnilSunkara1 @ThisIsDSP @AKentsOfficial @SVC_official @GMBents pic.twitter.com/6FaJTKzeJD
— Anil Ravipudi (@AnilRavipudi) November 16, 2019