మహారాష్ట్ర రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతుంది. నిన్న శనివారం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా బీజేఎల్పీ నేత దేవేంద్ర పడ్నవీస్ … ఉప ముఖ్యమంత్రిగా ఎన్సీపీ బహిష్కృత నేత అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సంఖ్యాబలం లేకుండా గవర్నర్ దేవేంద్ర పడ్మవీస్ ను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ఎలా ఆహ్వానిస్తారని కాంగ్రెస్,శివసేన,ఎన్సీపీ కూటమి కోర్టు మెట్లు ఎక్కింది.
అయితే దీనికంటే ముందు ఈ రోజు ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర ప్రాంతంలో బీజేపీ ఎంపీ సంజయ్ కకాడే ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ఇంటికెళ్లారు. దీంతో మహారాష్ట రాజకీయాల్లో పెనుసంచలనం చోటు చేసుకుంది.
అయితే అంతకుముందు ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని మోదీని,బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షాను కలవడం విశేషం. తాజాగా కేసు కోర్టులో ఉండగా అదే పార్టీకి చెందిన ఎంపీ శరద్ పవార్ ఇంటికెళ్లడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. ఇప్పటికే శరద్ పవార్ కు రాష్ట్ర పతి పదవీని మోదీ ఆఫర్ చేశారని వార్తలు వచ్చిన సంగతి విదితమే.