Home / MOVIES / రాములమ్మకు రాహుల్ కు మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనా.?.?

రాములమ్మకు రాహుల్ కు మధ్య గొడవలు సద్దుమణిగినట్టేనా.?.?

బిగ్ బాస్ కంటెస్టెంట్ లలో రాములమ్మ అలియాస్ శ్రీముఖి రాహుల్ ఇద్దరు బద్ద శత్రువులు. గతంలో ప్రాణ స్నేహితులు గా ఉన్న వీరిద్దరూ బిగ్ బాస్ కి వెళ్ళిన తర్వాత శత్రువులుగా మారి పోయారు. చాలా సందర్భాల్లో రాహుల్కు శ్రీముఖి పెద్ద గొడవ కూడా అయింది. టైటిల్ కూడా దాదాపుగా తనదే అనుకుంటున్న సమయంలో రాహుల్ హఠాత్తుగా బిగ్ బాస్ విన్నర్ టైటిల్ ఎత్తుకెళ్లి పోయాడు. అయితే బిగ్ బాస్ పూర్తయిన తర్వాత కూడా శ్రీముఖి కొంతకాలం కోపాన్ని వీడలేదు. బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరితోనూ కలవలేదు ముఖ్యంగా రాహుల్ అటెండ్ అయ్యి ఏ పార్టీలోనూ శ్రీముఖి కనిపించలేదు తన సొంత స్నేహితులతో పాటు విదేశాలకు వెళ్లి పోయింది తప్ప కలిసే ప్రయత్నం చేయలేదు.

అయితే అప్పుడు ఇప్పుడు ఎప్పుడూ శ్రీముఖి రియాల్టీ షో లతోపాటు స్టేషన్లను కనిపిస్తూ ఉంటుంది. కానీ గతంలో ఎక్కడా కనిపించని రాహుల్ విన్నర్ అయిన తర్వాత ఓ నాలుగైదు షోలో పార్టిసిపేట్ చేశాడు అక్కడ కూడా శ్రీముఖి ఉండడంతో తప్పనిసరి పరిస్థితిలో వీరిద్దరు మాట్లాడుకున్నారు. తాజాగా శ్రీముఖి రాహుల్ కలిసి దిగిన సెల్ఫీ ని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ గతం గతః అంటూ ట్వీట్ చేశారు. తమ స్నేహం ఇప్పుడే ప్రారంభమైందని ఇక నుంచి కలిసి ఉంటామని వీరిద్దరూ సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం రాహుల్ శ్రీముఖి మంచి స్నేహితులుగా కలిసిమెలిసి ఉంటూనే గతంలో జరిగిన వివాదాలకు ఫుల్స్టాప్ పెట్టారు.