తెలంగాణతో పాటు యావత్తు దేశమంతా శభాష్ అంటున్న దిశ నిందితుల ఎన్కౌంటర్ పై దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఈ ఎన్కౌంటర్ పై రిటైర్డు జడ్జితో విచారణ జరిపిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది.
ఈ ఎన్కౌంటర్ ను వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారించింది. తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. ఎన్కౌంటర్ కు సంబంధించిన పూర్తి సమాచారం తమ వద్ద ఉంది.
అందుకే దీనిపై ఢిల్లీ నుంచే రిటైర్డు జడ్జితో విచారణ జరుపుతాము. దీనిపై తెలంగాణ అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టులో కేసు కొనసాగుతుందని తెలిపింది.