ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం నేత.. మాజీ మంత్రి దేవినేని ఉమాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైదరాబాద్ హైవేపై భైఠాయించిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.
ఏపీ రాజధానిగా ఉన్న అమరావతిని మార్చవద్దు అని రైతులకు మద్ధతుగా ఆయన విజయవాడలో గొల్లపూడి వద్ద నిరసనలో పాల్గొన్నారు.. రాజధానిని మార్చవద్దని ప్లకార్డులు పట్టుకుని రైతులు పెద్ద ఎత్తున అందోళనలు చేశారు.
దీంతో హైవేకు ఇరువైపులా వాహనాలు భారీగా ఆగాయి. అటు రాజధానిని మార్చవద్దంటూ రైతులు వేసిన పిటిషన్ ను కొద్దిసేపట్లో హైకోర్టులో విచారణ చేపట్టనున్నారు.