తెలంగాణలో రైతు చనిపోతే ఆ రైతు కుటుంబం నడిరోడ్డున పడకూడదు.. ఆ రైతు కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉండాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన వినూత్న కార్యక్రమం రైతు బీమా. ఈ పథకం కింద రైతు చనిపోతే ఆ రైతు కుటుంబానికి రూ.5లక్షల ఆర్థిక సాయాన్ని అందజేస్తుంది .
ఈ నేపథ్యంలో రైతు బీమా పథకం కింద అర్హులైన రైతుల సంఖ్య భారీగా పెరగనున్నది. ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో ఏప్రిల్ నుంచి ఇప్పటి వరక్య్ లక్ష మంది ఈ పథకం కింద తమ పేర్లను నమోదు చేసుకున్నారు.
వచ్చే మార్చి నెలలోగా మరో లక్ష మంది చేరే అవకాశాలున్నాయని వ్యవసాయ శాఖ తాజాగా ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీంతో మొత్తం 2లక్షల మంది రైతులకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎల్ఐసీకి ప్రీమియం చెల్లించనున్నది.